కరోనాతో హాస్పిటల్ లో చేరిన మణిరత్నం!
on Jul 19, 2022

కొద్ది రోజులుగా మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు కరోనా సోకింది.
స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయించుకోగా మణిరత్నంకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మణిరత్నం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. వయస్సు(66 ఏళ్ళు) దృష్ట్యా ముందు జాగ్రత్తగా హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం.
కాగా, మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వన్-1' సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలోనే ఆయనకు కరోనా సోకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు టీజర్ లాంచ్ టైంలో స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ కూడా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పూర్తిగా కోలుకొని వెంటనే డిశ్చార్జ్ అయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



