స్మాల్ బ్రేక్ తీసుకున్న విష్ణు మంచు... శ్రీమతితో కలిసి!
on Oct 27, 2021

యంగ్ హీరో, ప్రస్తుత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు స్మాల్ బ్రేక్ తీసుకున్నాడు. వైఫ్ విరానికాతో కలిసి విదేశాలకు వెళ్ళాడు. 'మా' ఎన్నికలు మొదలు కాక ముందు నుంచి విష్ణు చాలా బిజీ బిజీగా గడిపారు. ముఖ్యంగా... ప్రకాష్ రాజ్ ప్యానల్ ఎన్నికలకు చాలా రోజుల ముందే పోటీ చేస్తున్నట్లు ప్రకటించి బరిలో దిగింది. విష్ణు ఎటువంటి ప్రకటనలు చేయలేదు. కానీ, చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులను కలవడం ప్రారంభించాడు. అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇరు ప్యానళ్ల మధ్య సఖ్యత కుదరలేదు. దాంతో కొన్ని రోజులు బిజీగా మీటింగులు జరిగాయి. ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడడంతో స్మాల్ ట్రిప్ వేశారు.
విరానికా అమెరికన్ సిటిజన్. పైగా అక్కడ వృత్తిపరమైన పనులు ఉన్నాయట. ఇటు సెలవులు తీసుకున్నట్లు ఉంటుంది. అక్కడ పనులు కూడా చూసుకున్నట్టు ఉంటుంది. అందుకని, అమెరికా వెళ్ళారేమో. భర్తతో కలిసి చిన్న హాలిడే ట్రిప్ కి వెళ్తున్నట్లు విరానికా పేర్కొన్నారు. ఆమె ఫోన్ మాట్లాడుతున్నప్పుడు విష్ణు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పని మీద వెళుతున్నట్లు చెప్పారు. తన భార్యను హాట్ అని పొగడడంతో పాటు ఎప్పుడూ ఫోన్లో ఉంటుందని... తనకు మంచి కంపెనీ అని ఆయన సరదాగా చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



