ఫోరెన్సిక్ సర్జన్ గా అమలా పాల్!
on Oct 27, 2021
కథానాయికగా కేరళకుట్టి అమలా పాల్ ది 12 ఏళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో అలరించింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ.. ఇలా దక్షిణాదికి చెందిన అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేసింది అమల.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ నిర్మాత అవతారమెత్తింది. `కడావర్` పేరుతో రూపొందుతున్న ఓ తమిళ చిత్రం కోసం తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది అమల. అంతేకాదు.. ఈ సినిమా కోసం నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనుంది అమలా పాల్. ఓ సిటీలో జరిగే సీరియల్ కిల్లింగ్స్ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో ఫోరెన్సిక్ సర్జన్ పాత్రలో కనిపించబోతోంది అమల. ఈ అక్టోబర్ 26 అమలా పాల్ 30వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది యూనిట్. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ పోస్టర్ లో.. మార్చురీలో శవాల మధ్య కూర్చుని భోజనం చేస్తూ షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది అమల. మరి.. ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్ చేసిన అమల.. సినిమాతోనూ ఆకట్టుకుంటుందేమో చూడాలి.
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న `కడావర్`కి అనూప్ ఎస్ ప్యానికర్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ జనం ముందుకు రానుంది.
Also Read