చైతూతో కీర్తి సురేశ్ రొమాన్స్!
on Oct 27, 2021
యువ సామ్రాట్ నాగచైతన్య చేతిలో ప్రస్తుతం `థాంక్ యూ`, `బంగార్రాజు`, `లాల్ సింగ్ చద్ధా` (హిందీ) చిత్రాలున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా తక్కువ గ్యాప్ లోనే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. మరోవైపు `మనం`, `థాంక్ యూ` చిత్రాల దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో ఓ హారర్ వెబ్ - సిరీస్ లో నటించేందుకు సిద్ధమయ్యాడు చైతూ.
ఇదిలా ఉంటే.. `అలా మొదలైంది`, `కళ్యాణ వైభోగమే`, `ఓ బేబి` వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబినేషన్ లో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వినిపిస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో చైతూకి జోడీగా కేరళకుట్టి కీర్తి సురేశ్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అదేగనుక నిజమైతే.. వీరిద్దరూ జంటగా నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది. గతంలో అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన కీర్తి సురేశ్ స్టారర్ `మహానటి`లో కాసేపు తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుగా కనిపించి మురిపించాడు చైతూ. మరి.. నాగచైతన్య, కీర్తి సురేశ్ జోడీ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
Also Read