మమ్ముట్టి సినిమాతో మలయాళ ఎంట్రీ.. అనసూయకు లక్కీ ఛాన్స్!
on Dec 29, 2021

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వెండితెరపై నటిగానూ మెప్పిస్తోంది. 'క్షణం', 'రంగస్థలం' వంటి సినిమాలతో తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేసి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అనసూయ. ఇటీవల పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'తో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ఇప్పుడు డైరెక్ట్ మలయాళ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
అల్లు అర్జున్ కి మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో పుష్ప సినిమాని అక్కడ భారీ గానే విడుదల చేశారు. ఈ సినిమాలో అనసూయ దాక్షాయణి పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న 'భీష్మ పర్వం' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అమల్ నీరద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలైస్ అనే పాత్రలో అనసూయ నటిస్తోంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ అనసూయ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. "అలైస్ పాత్ర కోసం నన్ను ఎంపిక చేసినందుకు అమల్ నీరద్ గారికి, మమ్మూట్టి గారికి ధన్యవాదాలు. ఇంతమంచి ప్రాజెక్ట్ తో మలయాళంలో డెబ్యూ అవుతానని కలలో కూడా అనుకోలేదు" అంటూ అనసూయ ట్వీట్ చేసింది.

అంతేకాదు తన పాత్ర లుక్ కి సంబంధించిన పోస్టర్ ని కూడా అనసూయ షేర్ చేసింది. చీరకట్టు, పెద్ద కళ్ళద్దాలతో అలైస్ గా అనసూయ లుక్ ఆకట్టుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



