ఏయన్నార్ తొలి ద్విపాత్రాభినయ చిత్రం `ఇద్దరు మిత్రులు`కి 60 ఏళ్ళు!
on Dec 29, 2021

తెలుగునాట పలు ద్విపాత్రాభినయ చిత్రాలు సందడి చేశాయి. అయితే, ఓ స్టార్ హీరో ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమాగా `ఇద్దరు మిత్రులు` (1961)కి టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు టైటిల్ రోల్స్ లో నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. బెంగాలీ చిత్రం `తషేర్ ఘర్` (1957) ఆధారంగా తెరకెక్కింది. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై డి. మధుసూదన రావు నిర్మించిన ఈ సినిమాలో అక్కినేనికి జంటగా రాజ సులోచన, ఈవీ సరోజ నటించగా శారద, రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, పద్మనాభం, అల్లు రామలింగయ్య, సూర్య కాంతం, జి. వరలక్ష్మి, పొట్టి ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Also read:చరణ్, సుకుమార్ కాంబోలో మరో మూవీ.. కన్‌ఫర్మ్ చేసిన రాజమౌళి!
దిగ్గజ స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు బాణీలు అందించిన ఈ సినిమాలో ``ఖుషీ ఖుషీగా నవ్వుతూ``, ``ఈ ముసి ముసి నవ్వులు``, ``హలో హలో ఓ అమ్మాయి``, ``శ్రీరామ``, ``నవ్వాలి నవ్వాలి``, ``పాడవేల రాధికా``, ``చక్కని చుక్క సరసుకు రావే`` వంటి గీతాలు రంజింపజేశాయి. 1961 డిసెంబర్ 29న విడుదలై జననీరాజనాలు అందుకున్న `ఇద్దరు మిత్రులు`.. నేటితో 60 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



