విజయ్ కూతురు సూసైడ్ లెటర్ లభ్యం.. అందులో ఏముందంటే..
on Sep 21, 2023
కథానాయకుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కూతురు మీరా (16).. మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోస్టు మార్టమ్ లోనూ వైద్యులు మీరాది సూసైడ్ గా చెప్పుకొచ్చారు. కాగా, తాజాగా మీరా ఆత్మహత్య చేసుకున్న గదిలో ఓ సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే.. "ఐ లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్, ఐ విల్ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. మై ఫ్యామిలీ విల్ సఫర్ వితౌత్ మి" అంటూ మీరా ఆ ఉత్తరంలో రాసుకొచ్చింది. ఎంతో ఎమోషనల్ గా ఈ సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మానసిక ఒత్తిడితోనే మీరా బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. మీరా ఆత్మహత్య సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు ప్రముఖులు ఈ వార్త విని షాక్ కి గురయ్యారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
