మే 20న మంచు లక్ష్మి ప్రసన్న కొత్త సినిమా ప్రారంభం..!
on May 11, 2016
మంచు వారి వారసురాలిగా, నటిగా, నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు మంచు లక్ష్మి. నటన పరంగా విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా ప్రారంభం కానుంది. గుణపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాధ్యం, వసూల్ రాజా సినిమాలు తీసిన డైరెక్టర్ కార్తికేయ గోపాలకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ నిర్మాతలు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘’మంచు లక్ష్మిగారు కథ వినగానే చేయడానికి ఒప్పుకున్నందుకు ఆమెకు మా సంస్థ తరపున ధన్యవాదాలు. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ చెప్పిన కథ చాలా కొత్తగా ఉంది. సినిమా మే 20న లాంచనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంటుంది. థ్రిల్లర్ కామెడి సబ్జెక్ట్ తో రూపొందతున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం. సినిమా ప్రారంభోత్సవం రోజున మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.
న్యాయం కోసం పోరాడే జడ్జ్ పాత్రలో మంచు లక్ష్మి ప్రసన్నగారి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తనకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



