రణ్ బీర్ కపూర్ కొత్త గర్ల్ ఫ్రెండ్ మిస్టరీ..!
on May 11, 2016

బాలీవుడ్ లో సెలబ్రిటీ జంటలకు ప్రేమలో పడటం, విడిపోవడం మంచినీళ్లు తాగినంత ఈజీ. హృతిక్ సుసానే, కోహ్లీ అనుష్క, అర్బాజ్ మలైకా అరోరా ..ఇలా పెళ్లైనా, ప్రేమలో ఉన్నా విడిపోవడం మాత్రం కామన్ అయిపోయింది. ప్రేమలో ఉన్నంత సేపూ చెట్టాపట్టాలేసుకుని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్నట్లుగా తిరిగేసే సెలబ్రిటీలు, విడిపోవడానికి మాత్రం నిముషం ఆలోచించట్లేదు. రణ్ బీర్ కపూర్ కత్రినా ల అఫైర్ కూడా ఇలాగే ముగిసింది. ఇద్దరూ ఎంతవరకూ ప్రేమలో మునిగిపోయారంటే, కలిసి ఉండటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కొనేసుకున్నారు. దానికి లవ్ నెస్ట్ అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు.
కానీ ఈ బంధం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. విడిపోయిన తర్వాత కూడా మళ్లీ వీళ్లిద్దరూ కలుస్తారేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. ఒక పార్టీలో ఇద్దరు కలిసొచ్చి, కలిసి వెళ్లడం ఆ ఆశలకు మరింత ఊతమిచ్చింది. అయితే తాజాగా వస్తున్న వార్తల్ని బట్టి, ఇక వీళ్లిద్దరూ కలవడం కష్టమే. కారణమేంటంటే రణ్ బీర్ కపూర్ మరో గర్ల్ ఫ్రెండ్ ను తగులుకున్నాడట. మీడియా కంట పడకుండా దాస్తున్న ఆ గర్ల్ ఫ్రెండ్ ఢిల్లీకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త కూతురని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఆ అమ్మాయి ఎవరు అన్నది మాత్రం బయటికి రాకుండా రణ్ బీర్ జాగ్రత్త పడుతున్నాడు. ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బాలీవుడ్ జనాలకు తెలియకుండా చూడాలని రణ్ బీర్ అనుకుంటున్నాడట. గర్ల్ ఫ్రెండ్ ను బాగానే పట్టినా, అసలు ఆమెతో ఎంత కాలం కలిసుంటాడు అనేదే ఇక్కడ అసలు ప్రశ్న.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



