ప్రపంచ టాప్ 10 లీడర్లలో ప్రియాంక చోప్రా..!
on May 11, 2016

ప్రియాంక చోప్రా గుడ్ టైం కొనసాగుతోంది. బాలీవుడ్ లో సరైన హిట్ లేకపోయినా, హాలీవుడ్ కు వెళ్లి క్వాంటికో టీవీ సీరీస్, బేవాచ్ సినిమాలో అవకాశాలతో పేరు తెచ్చుకోగలిగింది. రీసెంట్ గా పద్మశ్రీ అందుకున్న ప్రియాంక, ఇప్పుడు మిలీనియా టాప్ 10 లీడర్లలో చోటు సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల నుంచి ఫిల్టర్ చేసే ఈ లిస్ట్ లో చోటు దక్కడం చిన్న విషయం కాదు. అమెరికా కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ 1980 నుంచి 2000 మధ్య పుట్టిన వారిలో బెస్ట్ లీడర్స్ ను ఈ సర్వేకు ఎంపిక చేసింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, బ్రిటీష్ రాజకుమారుడు ప్రిన్స్ విలియం, టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్, మలాలా యూసఫ్ జాయ్ లాంటి ఎంతో మంది ప్రముఖులు ఉన్న ఈ జాబితాలో ప్రియాంక చోప్రా పదో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు పెరుగుతున్న క్రేజ్ కు ఈ ఘనత నిదర్శనమంటున్నారు సినీ ప్రముఖులు.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



