మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం ఎవరితరం కాదు!
on Jul 28, 2022

మోహన్‌బాబుతో మంచు లక్ష్మి తొలిసారి కలిసి నటిస్తోన్న చిత్రం 'అగ్ని నక్షత్రం'. యాక్టర్‌గా, టీవీ హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె 'అగ్నినక్షత్రం' చిత్రానికి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం అప్‌డేట్స్ ఇస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ఇటీవల ప్రోస్థటిక్ మేకప్ వేయించుకున్న తన చేతిని చూపించి, ఆశ్చర్యపర్చింది. ఒక్కో పాత్రను ఒక్కో పోస్టర్‌తో రివీల్ చేస్తూ, ఆ నటులను పరిచయం చేస్తూ వస్తోందామె.
లేటెస్ట్‌గా మలయాళం నటుడు సిద్దిఖ్‌ను పరిచయం చేసింది లక్ష్మి. ఆయన లుక్ పోస్టర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన ఆమె, "ఆత్యంత శక్తివంతుడు, ఫెరోషియస్ ఫార్మా టైకూన్ బలరాం వర్మను మీకు పరిచయం చేస్తున్నాం. మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం, ఆపడం ఎవరితరం కాదు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు శ్రీ సిద్దిక్ గారు మా సినిమాలో ఒక భాగమవ్వడం మాకు గర్వకారణం" అంటూ రాసుకొచ్చింది.
ఇప్పటికే కమిషనర్ చలపతి (సముద్రకని), డాక్టర్ మిథిల (చిత్రా శుక్లా), విక్రమ్ (విశ్వాంత్) పాత్రలను పోస్టర్ల ద్వారా పరిచయం చేసింది లక్ష్మి. ప్రతీక్ ప్రజోష్ డైరెక్ట్ చేస్తోన్న 'అగ్ని నక్షత్రం' మూవీని మోహన్‌బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



