మొన్న త్రివిక్రమ్, నేడు హరీష్ శంకర్.. తగ్గేదేలే అంటున్న బన్నీ!
on Jul 28, 2022

'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్క సినిమాతోనే ఆయన పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఆయన మ్యానరిజమ్స్, స్టెప్స్ కి బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ సైతం ఫిదా అయ్యారు. 'పుష్ప'కి ముందు వరకు సౌత్ కే పరిమితమైన ఆయన క్రేజ్.. ఇప్పుడు నార్త్ కి కూడా పాకింది. అందుకే ఆయనతో తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి బడా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి.

'పుష్ప పార్ట్-2' కి సన్నద్ధమవుతున్న బన్నీ ప్రస్తుతం వరుస యాడ్స్ లో నటిస్తున్నాడు. పైగా వీటికోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ని రంగంలోకి దింపుతుండటం విశేషం. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక యాడ్ లో నటించిన బన్నీ.. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో యాడ్ లో నటించాడు. ప్రముఖ పైపుల కంపెనీకి సంబంధించిన ఈ యాడ్ షూట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. అంతేకాదు ఈ యాడ్ కి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ పని చేయడం మరో విశేషం.
.webp)
వీటితో పాటు మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా బన్నీ క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ గా యూత్ లో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఇప్పుడు నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకే బడా బడా కంపెనీలు బన్నీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బన్నీ నటిస్తున్న మరో రెండు యాడ్స్ ని సుకుమార్, క్రిష్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



