ఎన్టీఆర్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి సుకుమార్ సాయం!
on Jul 28, 2022

ఇటీవల దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు కలిసి కథా చర్చలు జరుపుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'పుష్ప పార్ట్-1' పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ కావడంతో పార్ట్-2 స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడని, ఈ క్రమంలో తన ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు సాయం తీసుకుంటున్నాడని ప్రచారం జరిగింది. అయితే బుచ్చిబాబు మాత్రం అందులో వాస్తవం లేదని అంటున్నాడు.
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. అయితే తన రెండో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తోనే చేయాలని ఎంతగానే ఎదురుచూస్తున్నాడు. కానీ 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన తారక్ చేతిలో ఇప్పటికే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే తారక్ కోసం బుచ్చిబాబు మరి కొంతకాలం ఎదురు చూడక తప్పదు. ఈ క్రమంలో తన గురువు సుకుమార్ కోరిక మేరకు 'పుష్ప: ది రూల్' రైటింగ్ టీమ్ లో జాయిన్ అయ్యి హెల్ప్ చేస్తున్నాడని న్యూస్ వినిపించింది. అయితే ఈ వార్తలను తాజాగా బుచ్చిబాబు ఖండించాడు.

ఆ ఫోటో తాను చేయబోతున్న తరువాతి సినిమా స్టోరీ డిస్కషన్ సందర్భంలోది అని బుచ్చిబాబు ట్వీట్ చేశాడు. "మా గురువు గారు సుకుమార్ నా కోసం నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. సుకుమార్ సార్ సినిమా కథలో కూర్చుని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు, రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం, తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు." అని బుచ్చిబాబు రాసుకొచ్చాడు.
తాను పుష్ప-2 కోసం సుకుమార్ కి హెల్ప్ చేయడం కాదు, ఆయనే తన నెక్స్ట్ మూవీ కోసం హెల్ప్ చేస్తున్నాడని బుచ్చిబాబు చెప్పేశాడు. దీంతో సుకుమార్ హెల్ప్ చేస్తున్న ఆ కథ తారక్ కోసమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే తారక్ కి బుచ్చిబాబు కథ చెప్పగా, ఆయన ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినప్పటికీ కథలో కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. మరి బుచ్చిబాబు తారక్ సూచించిన మార్పుల గురించే డిస్కస్ చేస్తున్నాడా? లేక తారక్ డేట్స్ దొరికేలోపు మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడో తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



