గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన 'మనసానమః' దర్శకుడికి వీసా ప్రాబ్లెమ్స్!
on Sep 1, 2022

'మనసానమః' అనే చిన్న షార్ట్ ఫిల్మ్‌తో వందల కొద్ది అవార్డులు, ఎన్నో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ చేసే అవకాశం దక్కించుకున్న దీపక్ రెడ్డి.. అత్యధిక అవార్డులు గెలుపొందిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్న విషయం తెల్సిందే. భారతదేశ ఖ్యాతిని మరింత పెంచుతూ ఆస్కార్ క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ అవకాశం కూడా తన షార్ట్ ఫిల్మ్‌తో దక్కించుకున్నారు. అయితే ఆ స్క్రీనింగ్ కోసం అమెరికాకి దర్శకుడు వెళ్లలేకపోవడం చాలా దురదృష్టకరం.
గత ఏడాది నుంచీ వచ్చిన వీసా నిబంధనల కారణంగా 200కు పైగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వీసా రాని కారణంగా హాజరు కాలేకపోయానంటూ ఓ ట్వీట్ ద్వారా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాటిలో యు.ఎస్.లో జరిగిన ఆస్కార్ క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ కూడా ఉందని ఆయన చెప్పారు. మన దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా యు.ఎస్.లో జరిగే చివరి దశ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కైనా హాజరయ్యేందుకు వీసా ఇప్పించాల్సిందిగా అటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో పాటు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా తన ట్వీట్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశాడు. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఈ దర్శకుడికి సాధ్యమైనంత త్వరగా వీసా సమస్యలు తీరిపోతాయేమో చూద్దాం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



