దర్శకురాలిగా మారిన హీరోయిన్ శ్వేతా బసు!
on Sep 1, 2022

'కొత్త బంగారు లోకం'(2008) చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆదరణ పొందకపోవడం మరియు ఇతర కారణాల వల్ల క్రమంగా తెలుగు సినిమాలకు దూరమైంది. అయితే హిందీలో మాత్రం వరుస అవకాశాలతో నటిగా బాగానే రాణిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడామె దర్శకురాలి అవతారమెత్తడం ఆసక్తికరంగా మారింది.
శ్వేతా బసు 'రీటేక్' అనే షార్ట్ ఫిల్మ్ కి దర్శకత్వం వహిస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎంతో ప్రతిభావంతురాలైన శ్వేతా బసు దర్శకత్వంలో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నానని, ఈ టీమ్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో 'మిర్జాపూర్' వెబ్ సిరీస్ లో మున్నా భయ్యాగా అలరించిన దివ్యేందు శర్మ కూడా నటిస్తున్నాడు.

షార్ట్ ఫిల్మ్ తో దర్శకురాలిగా మారుతున్న శ్వేతా బసు ముందు ముందు సినిమాలకు కూడా దర్శకత్వం వహిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



