నాటి `మాస్టర్`కి జోడీగా నేటి `మాస్టర్` బ్యూటీ!
on Feb 1, 2022

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే సినిమాల్లో `మాస్టర్` ఒకటి. 1997 అక్టోబర్ లో రిలీజైన సదరు కాలేజ్ డ్రామా.. అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇక అదే `మాస్టర్` పేరుతో గత ఏడాది సంక్రాంతికి విడుదలైన తమిళ అనువాద చిత్రం కూడా బాక్సాఫీస్ విన్నర్ అనిపించుకుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ఈ రీసెంట్ `మాస్టర్`లో మాళవికా మోహనన్ నాయికగా నటించింది.
ఇదిలా ఉంటే.. నేటి `మాస్టర్`తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన మాళవికా మోహనన్.. నాటి `మాస్టర్`తోనూ జోడీకట్టనుందట. ఆ వివరాల్లోకి వెళితే.. `ఛలో`, `భీష్మ` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించిన యువ దర్శకుడు వెంకీ కుడుముల.. త్వరలో మెగాస్టార్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ సినిమాలో సెకండ్ లీడ్ గా మాళవికని ఎంచుకున్నారని బజ్. త్వరలోనే చిరుకి జోడీగా మాళవిక నటిస్తుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రానుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనున్న చిరు - వెంకీ కాంబో మూవీ 2023లో తెరపైకి రానుంది. ఈ లోపే `ఆచార్య`, `గాడ్ ఫాదర్`, `మెగా 154`, `భోళా శంకర్` చిత్రాలతో మెగాస్టార్ సందడి చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



