బాప్‌రే.. "ఊ అంటావా" సాంగ్ కోసం సమంతకు రూ. 5 కోట్లు ఇచ్చారా?
on Feb 1, 2022

తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌కు ఉన్న గిరాకీ మామూలుది కాదు. ఇదివరకు ఐటమ్ సాంగ్స్ నృత్య తారలు చేసేవాళ్లు. ఆ రోజులు మారిపోయాయి. ఇప్పుడు హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. వారు చేస్తే ఆ సాంగ్‌కు క్రేజ్ వస్తుందనే ఉద్దేశంతో డైరెక్టర్లు క్రేజీ హీరోయిన్లతో ఐటమ్ నంబర్స్ చేయిస్తున్నారు. అలా హీరోయిన్లతో ఐటమ్ సాంగ్స్ చేయిస్తున్న దర్శకుల్లో ఒకరు.. సుకుమార్. 'రంగస్థలం'లో పూజా హెగ్డేతో "జిగేల్ రాణి" ఐటమ్ నంబర్ చేయించి, ఆ సాంగ్‌కు సూపర్బ్ క్రేజ్ తెచ్చిన సుకుమార్, 'పుష్ప' మూవీలో "ఊ అంటావా" సాంగ్ కోసం సమంతను రంగంలోకి దించాడు. ఆ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి సమంత చేసిన డాన్స్, ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పట్లో జనాలు మరచిపోలేరు. Also read: 'లైగర్' ఇలా వచ్చాడు.. అలా వెళ్లాడు! ఫ్యాన్స్ నిరాశ చెందారు!!
అయితే ఆ పాట చేయడానికి మొదట సమంత ఒప్పుకోలేదు. తనను ఎలా రిసీవ్ చేసుకుంటారోననే డౌట్ ఆమెకు ఉంది. అయితే తనకు ధైర్యంచెప్పి అల్లు అర్జున్ ఆ పాట చేయడానికి కారకుడయ్యాడని ఓ ఈవెంట్‌లో సమంత స్వయంగా చెప్పింది. ఆ తర్వాత జరిగింది.. ఓ సంచలనం. ఆమె కాకుండా మరో తారను ఇప్పుడు ఆ సాంగ్‌లో మనం ఊహించుకోలేం. అయితే ఆ సాంగ్ చేయడానికి సమంతకు నిర్మాతలు ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యూనరేషన్‌గా చెల్లించారంటూ ఒక ప్రముఖ హిందీ పోర్టల్ రిపోర్ట్ చేసింది. ఆ సాంగ్ చేయడానికి సమంత రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందనీ, నిర్మాతలు చెల్లించారనీ 'కొయ్‌మొయ్ డాట్ కామ్' రాసింది. Also read: 'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన 'ఆచార్య'
నిజానికి ఓ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి సమంత తీసుకుంటున్న రెమ్యూనరేషన్ రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. అలాంటిది రెండు మూడు రోజుల్లో తీసేసే ఒక సాంగ్‌కు ప్రొడ్యూసర్లు సమంతకు రూ. 5 కోట్లు చెల్లించారంటే నమ్మలేని విషయం. నిజంగా ఆ సాంగ్‌లో పర్ఫామ్ చేసినందుకు సమంతకు ఎంత గిట్టుబాటయ్యిందో ఏమో..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



