సర్ ప్రైజ్.. అనూషతో నాగ శౌర్య పెళ్లి
on Nov 10, 2022

యువ హీరో నాగ శౌర్య ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ నెల 20న అనూష అనే యువతి మెడలో నాగ శౌర్య మూడు ముళ్ళు వేయబోతున్నాడు.
'ఊహలు గుసగుసలాడే', 'ఛలో' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ శౌర్య ఇటీవల 'కృష్ణ వ్రింద విహారి' సినిమాతో పలకరించాడు. ప్రస్తుతం శౌర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో సడెన్ గా పెళ్లి న్యూస్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఈ నెల 20న బెంగళూర్ లో శౌర్య వివాహం కానుంది. ఆదివారం ఉదయం 11:25కి పెళ్లి ముహూర్తం. ముందురోజు అంటే 19 తేదీన మెహందీ ఫంక్షన్ జరగనుంది.
ఇది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా?.. పెళ్ళికి ఎవరెవరు హాజరవుతున్నారు? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



