మహేష్...చరణ్ అక్కడేం చేస్తున్నారు?
on Dec 29, 2016

రికార్డులు, నెంబర్ గేమ్‌లూ.. అభిమానుల వరకే! బయట మాత్రం హీరోలు దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకొంటుంటారు. పార్టీలు చేసుకొంటుంటారు. చిత్రసీమ వరకూ ఇదో ఆరోగ్యకరమైన సంప్రదాయమే. దాన్ని మహేష్ బాబు, రామ్ చరణ్‌లు కూడా ఫాలో అయిపోయారు. చరణ్, మహేష్‌ల సోషల్ నెట్ వర్కింగ్ ఖాతాల్లో ఓ ఫొటో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. యూరప్ ట్రిప్‌లో ఉన్న మహేష్ బాబు ఫ్యామిలీని చరణ్ కలసిన ఫొటో అది. దాంతో.. అటు చరణ్ ఫ్యాన్స్, ఇటు ప్రిన్స్ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో ఇదే హాట్ పిక్. చరణ్, మహేష్ అక్కడ ఎందుకు కలిశారు, ఏం చేస్తున్నారు? వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ పండగల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మహేష్ యూరప్ వెళ్లాడు. ధృవ విజయాన్ని సెలబ్రేట్ చేసుకొంటూ చరణ్ కూడా అక్కడే ఉన్నాడు. మహేష్ కూడా యూరప్‌లోనే ఉన్నాడన్న సంగతి తెలుసుకొని, చరణ్ వెళ్లి కలుసుకొని వచ్చాడు. అప్పుడు తీయించుకొన్న పిక్ అది. అలా.. టాప్ హీరోలిద్దరూ యూరప్‌లో ఎంజాయ్ చేస్తూ... ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకొన్నారన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



