సూపర్ స్టార్ మహేష్ సరికొత్త రికార్డ్..!
on Apr 3, 2016

మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో హాలీవుడ్ హీరో అని మహేష్ ను ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటుంటారు. పెర్ఫామెన్స్ లో అద్భుతమైన వేరియేషన్స్ పలికించగల నటుడు మహేష్. యువర్స్ ట్రూలీ మహేష్ అన్న పేరు ఆయన అభిమానులకు బాగా పరిచయం. అదే మహేష్ ట్విట్టర్ హ్యాండిల్ పేరు. మహేష్ ట్విట్టర్లోకి వచ్చిన తర్వాత, ఆయన కోసం అప్పటికి ట్విట్టర్ అకౌంట్ లేని వాళ్లు కూడా క్రియేట్ చేసుకుని ఫాలో అవడం మొదలెట్టారు. లేటెస్ట్ గా మహేష్ ట్విట్టర్ రెండు మిలియన్ ఫాలోవర్ల సంఖ్యను దాటింది. అంటే 20 లక్షలు. దక్షిణాది హీరోల్లో ట్విట్టర్ వాడేవాళ్లలో చాలా తక్కువమందికి మాత్రమే 20 మిలియన్ ఫాలోవర్లుండటం విశేషం. దీంతో మహేష్ ల్యాండ్ మార్క్ చేరాడని ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తన ట్విట్టర్లో మహేష్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్స్ ఇస్తుంటారు. లేటెస్ట్ గా బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రాగ్రెస్ ఫోటోలతో పాటు, బ్రహ్మోత్సవం ప్రొడ్యూసర్ సినిమా ఊపిరి గురించి ట్వీట్ చేశారు మహేష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



