ప్రియాంకా చోప్రా సూసైడ్ చేసుకోబోయిందట..!
on Apr 3, 2016

బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ గా ప్రస్తుతం ప్రియాంక చోప్రా స్టార్ స్టేటస్ లో ఉంది. హాలీవుడ్ లో క్వాంటికో టీవీ సీరీస్, డ్వేన్ జాన్సన్ తో మూవీలో విలన్ రోల్..ఇలా పిగ్గీ చోప్స్ కెరీర్ దూసుకెళ్తోంది. కానీ కెరీర్ మొదలైన కొత్తలో ప్రియాంక సూసైడ్ చేసుకోవాలనుకుందట. ఆ సమయంలో తను రక్షించడం వల్లే ఆమె బయటపడిందని చెబుతున్నాడు అప్పటి ఆమె పర్సనల్ మ్యానేజర్ ప్రకాష్ జాజు. రెండు మూడు సార్లు సూసైట్ ప్రయత్నాలు చేసిందని, చాలా వీక్ గా ఉండేదని తన ట్విట్టర్లో చెబుతున్నాడు. బాలీవుడ్ కు హీరోయిన్ అవుదామని వచ్చేవాళ్లెవరైనా, ముంబైకు ఒంటరిగా రావద్దని, ఒకవేళ వస్తే మాత్రం డిప్రెషన్, ఒంటరితనం పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగిస్తాయంటున్నాడు. ప్రియాంక మాజీ లవర్ అసీమ్ మర్చెంట్ తల్లి మరణం ప్రియాంకను కుంగదీసిందని, ఆ సమయంలో ఆమె కిటికీ నుంచి కిందికి దూకేసే ప్రయత్నం చేయబోయిందని, తానే ఆమెను బలవంతంగా కుర్చీకి కట్టేసి, కంట్రోల్ చేశానని ట్వీట్ చేశాడు ప్రకాష్. అతని మాటల్లో నిజం ఎంత ఉందో పక్కన పెడితే, ప్రియాంక అభిమానులందరూ, ఆమె పేరును ఉపయోగించుకుని జాజూ ఫేమస్ అవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ అతన్ని తిట్టి పోస్తున్నారు. ఇంత జరుగుతున్నా, ప్రియాంక ఏమాత్రం స్పందించకపోవడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



