మహేశ్‌కు కరోనా.. స్వీయ ఐసోలేషన్‌లో సూపర్‌స్టార్!
on Jan 6, 2022

సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు కరోనావైరస్ సోకింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆయన వెల్లడించాడు. చిన్నపాటి లక్షణాలతో తనకు కొవిడ్-19 సోకినట్లు తేలిందనీ, వైద్యుని పర్యవేక్షణలో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాననీ ఆయన తెలిపాడు. తిరిగి పనిలోకి రావడానికి ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పాడు.
ఇటు ట్విట్టర్, అటు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఈ మేరకు ఆయన ఓ నోట్ షేర్ చేశాడు.
"నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, చిన్నపాటి లక్షణాలతో టెస్టులో నేను కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇంట్లోనే నేను ఐసోలేట్ అయి, వైద్యపరమైన నియమ నిబంధనలు పాటిస్తున్నాను. నాకు దగ్గరగా మెదిలిన వాళ్లందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాక్సిన్ తీసుకోని వాళ్లంతా వెంటనే తీసుకోవాలని అర్థిస్తున్నాను. వాక్సిన్ తీసుకుంటే అది తీవ్రమైన లక్షణాలు లేకుండా, హాస్పిటల్ పాలవకుండా కాపాడుతుంది. దయచేసి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండండి. తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నాను.
ప్రేమతో - మహేశ్‌బాబు" అని అందులో మహేశ్ రాసుకొచ్చాడు.

ఇటీవలే ఆయన వదిన శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్-19 అని తేలింది. ఇటీవల మహేశ్ కుటుంబం, శిల్ప కుటుంబం దుబాయ్‌లో సెలవులు గడిపారు. అక్కడే ఆమెకు కొవిడ్ సోకింది. ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చాక తనకు కొవిడ్ అని నిర్ధారణ అయినట్లు మహేశ్ వెల్లడించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



