బన్నీని పొగిడాడు.. రష్మికను మరిచాడు! మహేశ్‌పై జోరుగా ట్రోల్స్!!
on Jan 6, 2022

మహేశ్‌బాబు ఇటీవల అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప' మూవీని చూశాడు. ఆ తర్వాత ట్విట్టర్‌లో బన్నీ నటన, సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్‌తో పాటు మొత్తం టీమ్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. మంగళవారం రాత్రి మహేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో, "పుష్పగా అల్లు అర్జున్ స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్.. స్టెల్లార్ యాక్ట్.. సుకుమార్ మరోసారి తన సినిమా రా, రస్టిక్, బ్రూటల్లీ హానెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. తన క్లాసే వేరు.." అని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో "దేవి శ్రీప్రసాద్ ఏం చెప్పను.. నువ్వు రాక్‌స్టార్‌వి!! మొత్తం మైత్రి మూవీ మేకర్స్ టీమ్‌కు కంగ్రాట్స్. మిమ్మల్ని చూస్తుంటే ప్రౌడ్‌గా ఉంది గైస్" అని రాసుకొచ్చాడు.
"థాంక్యూ వెరీ మచ్ మహేశ్‌బాబు గారూ.. పర్ఫార్మెన్స్‌ను, అందరి పనితనాన్నీ, 'పుష్ప' ప్రపంచాన్ని ఇష్టపడినందుకు చాలా ఆనందంగా ఉంది. హృదయాన్ని స్పృశించే కాంప్లిమెంట్. హంబుల్డ్" అని రిప్లై ఇచ్చిన బన్నీ దానికి బ్లాక్ హార్ట్ ఎమోజీని జోడించాడు.
Also read: టాక్ ఆఫ్ ద టౌన్: 'పుష్ప'పై మహేశ్ ట్వీట్.. బన్నీ రిప్లై!
అప్పటిదాకా ఎడమొహం పెడమొహంలా ఉంటూ వచ్చిన ఇద్దరి ఫ్యాన్స్.. తమ హీరోలు ట్విట్టర్ ద్వారా ఒకరినొకరు పలకరించుకోవడం చూసి, చాలా ఆనందపడ్డారు. అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం బాగా అప్సెట్ అయ్యారు. ఒక నెటిజన్ "రష్మికని మెన్షన్ చేయలే ఏంటి బ్రో?" అని రాస్తే, మరొకతను, "నీనుంచి అతిపెద్ద అగౌరవం!! కనీసం ఫిమేల్ లీడ్‌ను మెన్షన్ చేయలేదు" అని ట్వీట్ చేశాడు. ఇంకొంకతను "రష్ మీద ద్వేషం దేనికి?" అని ప్రశ్నించాడు.
Also read: ప్రభాస్ 'రాధేశ్యామ్'పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి లేదా?
నిజమే.. హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లను పేరుపేరునా ప్రస్తావించి మెచ్చుకున్న మహేశ్, 'పుష్ప' హీరోయిన్ రష్మిక పేరును ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఎందుకంటే మహేశ్, రష్మిక జంటగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో నటించారు. 2020 సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక, 'పుష్ప'లో శ్రీవల్లి పాత్రలో ప్రదర్శించిన అభినయాన్ని అందరూ ప్రశంసించారు. "సామి సామి" పాటలో ఆమె చేసిన డ్యాన్సులు, ఆమె గ్లామర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



