నిర్భయ దోషుల ఉరిపై మహేశ్ ట్వీట్!
on Mar 20, 2020

నిర్భయ కేసులో నలుగురు దోషులను శుక్రవారం ఉదయం ఉరి తీయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజానీకంతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా నిర్భయ దోషుల ఉరితో న్యాయ వ్యవస్థపై నమ్మకం మళ్లీ కలుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ సైతం ఈ ఉదంతంపై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించాడు.
"సుదీర్ఘ కాలం నిరీక్షణ.. కానీ న్యాయం చేకూరింది!! నిర్భయ తీర్పు న్యాయ వ్యవస్థపై మన నమ్మకాన్ని పునరుద్ధరించింది. దృఢమైన ప్రయత్నాలు కొనసాగించిన నిర్భయ తల్లిదండ్రలకు, వారి అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తున్నా. దారుణ నేరాలలో త్వరితగతి తీర్పులు, కఠిన చట్టాల కోసం ఇప్పటికీ వాదిస్తున్న న్యాయవ్యవస్థను గౌరవిద్దాం" అని ఆయన ట్వీట్ చేశాడు.

తెలుగువాళ్లకు సుపరిచితుడైన తమిళ హీరో కార్తీ, ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత నిర్భయకు న్యాయం లభించింది. "న్యాయం కోసం పొల్లాచ్చి కేసులో ఎంత కాలం వేచి చూడాలో ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే ఏడాది గడిచింది. దాన్నుంచి నేర్చుకున్న పాఠాలను మర్చిపోకూడదని ఆశిస్తున్నా. ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి" అని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



