కరోనా ఎఫెక్ట్... కెజియఫ్2 షూటింగ్ వాయిదా
on Mar 20, 2020
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', విక్టరీ వెంకటేష్ 'నారప్ప', ప్రభాస్ 20, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్', హిందీలో షాహిద్ కపూర్ 'జెర్సీ'... లేటెస్టుగా ఈ లిస్టులో కన్నడ సినిమా 'కెజిఎఫ్ 2' కూడా చేరింది. అదేనండి... కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్న చిత్రాల జాబితాలో యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కూడా చేరింది. నిజానికి, ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. హీరో యష్, ఇందులో విలన్ రోల్ చేస్తున్న సంజయ్ దత్ మధ్య రెండు భారీ ఫైట్స్ తీయాలి. మార్చి 17 నుండి షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే... కరోనా అడ్డు వచ్చింది. ఈ మహమ్మారిని లెక్క చెయ్యకుండా షూటింగ్ చేయడానికి యష్ ముందుకొచ్చారట. అయితే... మిగతా యూనిట్ అంతా వద్దని నచ్చ చెప్పి షెడ్యూల్ క్యాన్సిల్ చేయించారట. అదీ సంగతి. ఈ ఏడాది అక్టోబర్ 23న సినిమా విడుదల చేయనున్నారు. మొదట గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే.. 23కి సినిమాలో ఒక స్పెషాలిటీ ఉందట. అందుకని, ఆ తేదీకి విడుదల చేయాలని నిర్ణయించారు. ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్ ప్రధాన మంత్రి పాత్రలో, మరో కీలక పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు.