28, 29.. తారక్ లాగే మహేశ్‌కి కూడా..!
on Jul 15, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాటలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పయనిస్తున్నారా!? అవునన్నదే పరిశీలకుల మాట. ఆ వివరాల్లోకి వెళితే.. కథానాయకుడిగా తారక్ తన కెరీర్ లో 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేశారు. `అరవింద సమేత వీర రాఘవ` (2018) పేరుతో రూపొందిన సదరు చిత్రం మంచి వసూళ్ళు కురిపించింది. కట్ చేస్తే.. ఇప్పుడు మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 28వ సినిమా (#SSMB28)కి త్రివిక్రమ్ నే దర్శకుడు.
అంతేకాదు.. ఎన్టీఆర్ 29వ చిత్రంగా రూపొందిన `ఆర్ ఆర్ ఆర్`కి దర్శకధీరుడు రాజమౌళి కెప్టెన్ కాగా.. మహేశ్ బాబు కథానాయకుడిగా నటించబోయే 29వ ప్రాజెక్ట్ కి కూడా జక్కన్ననే నిర్దేశకుడు. అంటే.. తారక్ 28, 29వ చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్, రాజమౌళి కాంబినేషన్ లోనే మహేశ్ బాబు కూడా 28, 29వ సినిమాలను చేయబోతున్నారన్నమాట. మరి.. తారక్ కి అచ్చొచ్చిన ఈ దర్శకద్వయం.. మహేశ్ కి కూడా కలిసొస్తారేమో చూడాలి.
కాగా, మహేశ్ - త్రివిక్రమ్ కాంబో మూవీ 2023 వేసవిలో విడుదల కానుండగా.. మహేశ్ - రాజమౌళి ప్రాజెక్ట్ 2024లో తెరపైకి వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



