అఖిల్ 'ఏజెంట్' టీజర్.. వైల్డ్ సాలే!
on Jul 15, 2022
.webp)
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
'ఏజెంట్' టీజర్ చూస్తుంటే ఇది అఖిల్ కి పర్ఫెక్ట్ పాన్ ఇండియా డెబ్యూ అనిపిస్తుంది. వైల్డ్ మ్యాన్ గా అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్, పర్ఫామెన్స్ ఆకట్టుకుంటున్నాయి. మోస్ట్ వైలెంట్ మరియు మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా అఖిల్ కనిపిస్తుండగా.. అఖిల్ ని పట్టుకునే స్పెషల్ ఆఫీసర్ మహదేవ్ పాత్రలో మమ్మూట్టి కనిపిస్తున్నారు. ఓ వైపు అతన్ని పట్టుకోవడానికి ఎటువంటి ఆధారాల్లేక మమ్మూట్టి అవస్థలు పడుతుంటే.. మరోవైపు అఖిల్ సరదాగా గన్స్ పట్టుకొని అందరిని కాల్చుతూ వైలెన్స్ సృష్టిస్తుండటం టీజర్ లో చూడొచ్చు. ఇక టీజర్ లో 'వైల్డ్ సాలే' అని అఖిల్ ని సాక్షి అందం ఆకట్టుకుంటోంది. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్, అఖిల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డైలాగ్ డెలివరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిప్ హాప్ తమిజా సంగీతం విజువల్స్ ని ఎలివేట్ చేస్తూ ఇంప్రెసివ్ గా ఉంది.

రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



