2022 ద్వితీయార్ధంః సందడంతా వీరిదే!
on Jul 15, 2022

2022 ద్వితీయార్ధంలో పలువురు ప్రముఖులు రెండు, అంతకుమించి సినిమాలతో పలకరించబోతున్నారు. వారి వివరాల్లోకి వెళితే..
నాగార్జునః 2022 ఫస్టాఫ్ లో `బంగార్రాజు`తో ఎంటర్టైన్ చేసిన స్టార్ హీరో నాగార్జున.. సెకండాఫ్ లో సెప్టెంబర్ 9న హిందీ అనువాద చిత్రం `బ్రహ్మాస్త్రః పార్ట్ వన్ శివ`తోనూ, అక్టోబర్ 5న `ది ఘోస్ట్`తోనూ పలకరించనున్నారు.
రవితేజః ఈ క్యాలెండర్ ఇయర్ ఫస్టాఫ్ లో `ఖిలాడి`గా పలకరించిన రవితేజ.. సెకండాఫ్ లో `రామారావు ఆన్ డ్యూటీ`, `రావణాసుర`, `ధమాకా`తో ఎంటర్టైన్ చేయనున్నారు. వీటిలో ముందుగా `రామారావు ఆన్ డ్యూటీ` జూలై 29న రిలీజ్ కానుంది.
నాగచైతన్యః 2022 ప్రథమార్ధంలో `బంగార్రాజు`తో సందడి చేసిన నాగచైతన్య.. ద్వితీయార్ధంలో జూలై 22న `థాంక్ యూ`తోనూ.. ఆగస్టు 11న ఆమిర్ ఖాన్ హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్ధా`తోనూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
విజయ్ దేవరకొండః 2020లో రిలీజైన `వరల్డ్ ఫేమస్ లవర్`తో చివరిసారిగా హీరోగా వినోదాలు పంచిన విజయ్ దేవరకొండ.. ఈ ఆగస్టు 25న `లైగర్`తోనూ, డిసెంబర్ 23న `ఖుషి`తోనూ పలకరించనున్నాడు.
నిఖిల్ః 2019 చివరలో `అర్జున్ సురవరం`గా ఎంటర్టైన్ చేసిన యంగ్ హీరో నిఖిల్.. ఈ ఆగస్టులో `కార్తికేయ 2`తోనూ, సెప్టెంబర్ లో `18 పేజెస్`తోనూ, అక్టోబర్ లో `స్పై`గానూ జనం ముందుకు రాబోతున్నాడు.
సమంతః ఈ సంవత్సరం ప్రథమార్ధంలో తమిళ అనువాదం `కె.ఆర్.కె`తో పలకరించిన అగ్ర కథానాయిక సమంత.. ద్వితీయార్ధంలో `యశోద`, `శాకుంతలం`, `ఖుషి`తో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది.
రాశీ ఖన్నాః జూలై 1న `పక్కా కమర్షియల్`తో పలకరించిన రాశీ ఖన్నా.. జూలై 22న `థాంక్ యూ`తో సందడి చేయనుంది. అలాగే దీపావళికి తమిళ అనువాద చిత్రం `సర్దార్` రానుండగా.. `తిరుచిత్రాంబళమ్` (తమిళ్), `యోధ` (హిందీ) కూడా ఇదే క్యాలెండర్ ఇయర్ సెకండాఫ్ లో తెరపైకి వస్తున్నాయి.
తమన్ః ఫస్టాఫ్ లో అరడజను సినిమాలతో ఎంటర్టైన్ చేసిన స్టార్ కంపోజర్ తమన్.. సెకండాఫ్ లో `థాంక్ యూ`, `గాడ్ ఫాదర్`, `ప్రిన్స్`, `ఎన్బీకే 107`తో సందడి చేయనున్నాడు.
దేవి శ్రీ ప్రసాద్ః 2022 ప్రథమార్ధంలో ఐదు సినిమాలతో సందడి చేసిన అగ్ర స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్.. సెకండాఫ్ లో ఇప్పటికే `ది వారియర్`తో పలకరించగా, సెప్టెంబర్ 2న `రంగ రంగ వైభవంగా`తో ఎంటర్టైన్ చేయనున్నాడు.
వీరితో పాటు మరికొందరు ప్రముఖులు ఈ క్యాలెండర్ ఇయర్ సెకండాఫ్ లో రెండు, అంతకుమించి సినిమాలతో అలరించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



