'పుష్ప' కోసం అమెజాన్ ప్రైమ్ అంత చెల్లించిందా?
on Jan 7, 2022

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17 న థియేటర్స్ లో విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకుపోతున్న పుష్ప.. సంక్రాంతి సమయంలో మరిన్ని కలెక్షన్స్ రాబడుతుందని భావించారంతా. కానీ అనూహ్యంగా ఈరోజు(జనవరి 7) నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
'పుష్ప' థియేట్రికల్ రిలీజ్ కి ముందే నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకున్నారు. అందువల్లే థియేటర్లలో విడుదలైన 22వ రోజుకే ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. ఈరోజు రాత్రి 8 గంటల నుండి హిందీ మినహాయించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో పుష్ప స్ట్రీమింగ్ కానుంది.
'పుష్ప ది రైజ్' సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దాదాపు రూ.30 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. ఇదిలా ఉంటే ఓటీటీ కంటే శాటిలైట్ రైట్స్ ద్వారా పుష్ప మేకర్స్ కి ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తున్నట్లు తెలుస్తోంది.
పుష్ప హిందీ వెర్షన్ ఓటీటీ వెర్షన్ కి ఇంకా సమయమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే హిందీలో పుష్ప అంచనాలకు మించిన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



