నాని 'దారే లేదా' సాంగ్ కి మహేష్ ప్రశంసలు
on Jun 19, 2021
నేచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై 'దారే లేదా' అనే సందేశాత్మక సాంగ్ రూపొందించారు. కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు అంకితమిస్తూ రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియోలో హీరో సత్యదేవ్, రూప నటించారు. కరోనా మహమ్మారి విజృంబిస్తున్న ఈ క్లిష్ట సమయంలో డాక్టర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు.. తమ కుటుంబాలను వదిలేసి మరీ ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది కళ్లకు కట్టినట్లు ఈ సాంగ్ లో చూపించారు.
'దారే లేదా' సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా 'దారే లేదా' వీడియోపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. " మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను గౌరవించేందుకు మంచిదారిని ఎన్నుకున్నారు. నిండు హృదయంతో చేసిన ఈ వీడియో చూసి.. నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నాని మరియు అతని టీమ్ అద్బుతమైన పనితనాన్ని ప్రదర్శించారు." అని మహేష్ ప్రశంసించారు.
'దారే లేదా' సాంగ్ కు కేకే లిరిక్స్ అందించగా.. విజయ్ బులగానిన్ సంగీతం అందించారు.
Also Read