'లైగర్' ఫస్ట్ లుక్ అరుదైన రికార్డు
on Jun 19, 2021
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'లైగర్'. విజయ్-పూరీల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో లైగర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటికే విడుదలైన 'లైగర్' ఫస్ట్ లుక్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా 'లైగర్' ఫస్ట్ లుక్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
సౌత్ ఇండియాలోనే సోషల్ మీడియాలో అత్యధిక లైక్ లు పొందిన ఫస్ట్‌లుక్ పోస్టర్ గా లైగర్ నిలిచింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇన్ స్టాగ్రామ్‌లో 2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి రికార్డు సృష్టించింది. విజయ్-పూరీ కాంబోలో వస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. ముందు ముందు ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చెప్పాలి.
లైగర్ మూవీని ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటున్న లైగర్.. సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read