ఒంటరిగా గడపడం చాలా కష్టం!
on May 15, 2020

లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని అల్లు శిరీష్ వెయిట్ చేస్తున్నాడు. ఒంటరిగా గడపడం చాలా కష్టమని అతను భావిస్తున్నాడు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పిక్చర్ ఒకటి అతను షేర్ చేశాడు. అందులో గ్రే స్వెటర్, డెనిమ్ ధరించి ఉన్నాడు. "లాక్‌డౌన్ ముగింపు కోసం ఎదురుచూస్తున్నా. అప్పుడు మరీ ఆత్మనిర్భరంగా ఉండాల్సిన పనిలేదు. ఒంటరిగా జీవించడం చాలా కష్టం" అని ఆ ఫొటోకు క్యాప్షన్ జోడించాడు శిరీష్.
మదర్స్ డేకి తన తల్లితో కలిసి దిగిన ఫొటోను అతను షేర్ చేశాడు. "అందరు అందమైన అమ్మలకు హ్యాపీ మదర్స్ డే. నువ్వు చేసిన త్యాగాలకు, నువ్వు అందించిన ప్రేమకు, ఇన్నేళ్లుగా నన్ను తీర్చిదిద్దుతూ వచ్చిన నీకు థాంక్స్. అంతేకాదు, నేను నీ ఫేవరేట్ కొడుకును అయినందుకు చాలా ఆనందంగా ఉంది. హాహాహా" అని పోస్ట్ చేశాడు. చివరగా శిరీష్ 'ఏబీసీడీ - అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' మూవీలో కనిపించాడు. ఆ సినిమా సరిగా ఆడలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



