ENGLISH | TELUGU  

లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ 

on Sep 5, 2025

సినిమా పేరు: లిటిల్ హార్ట్స్ 
తారాగణం: మౌళి తనూజ్, శివాని నాగరం ,జయకృష్ణ రాజీవ్ కనకాల, కాంచి, అనితా చౌదరి,సత్య కృష్ణన్, నిఖిల్ తదితరులు  
మ్యూజిక్: శింజిత్ ఎర్రమిల్లి  
ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి  
రచన, దర్శకత్వం: సాయి మార్తాండ్  
సినిమాటోగ్రాఫర్: సూరియా బాలాజీ 
బ్యానర్: ఈటీవీ విన్ ప్రొడక్షన్  
థియేటర్స్ రిలీజ్: బన్నీ వాసు వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ 
నిర్మాత: ఆదిత్య హాసన్ 
విడుదల తేదీ: సెప్టెంబర్ 5 ,2025 

 90 's వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన 'మౌళి తనూజ్'(Mouli Tanuj)ఈ రోజు 'శివాని నాగరం'(Sivani nagaram)తో కలిసి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'లిటిల్ హార్ట్స్'(Little hearts)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మేకర్స్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యిందో లేదో చూద్దాం.

కథ
అఖిల్(మౌళి తనూజ్) చదువులో యావరేజ్ స్టూడెంట్. ఇంటర్ లో తన క్లాస్ మేట్ ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా అఖిల్ ని ప్రేమిస్తుంది. కానీ ఎంసెట్ లో అఖిల్  
కి  ర్యాంక్  రాకపోవడంతో ఆ అమ్మాయి ఛీ కొట్టి బ్రేక్ అప్ చెప్తుంది. దాంతో లైఫ్ లోతన హోదాని కాకుండా, తనని మాత్రమే ఇష్టపడే అమ్మాయిని,ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అఖిల్ తండ్రి పేరు గోపాల్ రావు(రాజీవ్ కనకాల). బంధువుల్లో పరువు నిలబడటం కోసమైనా, అఖిల్ ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెయ్యాలనే లక్ష్యంతో ఉంటాడు. దాంతో లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేర్పిస్తాడు. అక్కడ తన లాగే లాంగ్ టర్మ్ కోచింగ్ కి జాయిన్ అయిన కాత్యాయని ( శివాని నాగరం) ని చూసి ప్రేమలో పడతాడు. అఖిల్ కంటే కాత్యాయని వయసులో మూడేళ్లు పెద్ద. మరి అఖిల్ తన ప్రేమని కాత్యాయని కి చెప్పాడా? కాత్యాయని ఒప్పుకుందా? లేక వయసు తేడా అడ్డు వచ్చిందా? ఇంట్లో పేరెంట్స్ పరిస్థితి ఏంటి? అఖిల్, కాత్యాయని చదువుల పరిస్థితి ఏంటి? ఒక వేళ ఆ ఇద్దరు పెళ్లి పీటల దాకా వెళ్తే, ఏమైనా  ఆటంకాలు ఎదురయ్యాయా? వస్తే వాటిని ఎలా ఎదుర్కున్నారనేదే 'లిటిల్ హార్ట్స్' చిత్ర కథ 

ఎనాలసిస్ 
ప్రస్తుతం ఇంచుమించు ప్రతి ఇంట్లో 'లిటిల్ హార్ట్స్' కథ, అందులోని క్యారక్టర్ లు రన్ అవుతు ఉన్నాయి. అందుకే స్క్రీన్ పై మూవీ చూస్తున్నంత సేపు మన ఇంట్లో జరుగుతున్న సన్నివేశాలు లాగా అనిపిస్తుంటాయి. అందుకే మేకర్స్ చాలా తెలివిగా ప్రతి సీన్ లోను ఎంటర్ టైన్ మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చిత్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే. సినిమా ప్రారంభ సన్నివేశం నుంచే  లాజిక్ లు వెతక్కూడదని మనకి మనమే ఫిక్స్ అవ్వడం కూడా ఈ చిత్రం స్పెషాలిటీ. ఫస్ట్ హాఫ్ లో అఖిల్ తో పాటు ఫ్యామిలీ మధ్య వచ్చే సీన్స్,  లవ్ బ్రేక్ అప్, ఫ్రెండ్స్ తో సీన్స్ రొటీన్ గానే  అనిపించాయి. కానీ కాత్యాయని ఎంటర్ అవ్వడంతో కథనంలో స్పీడ్ పెరిగింది.  కాత్యాయని ప్రేమ పొందడం కోసం అఖిల్ చేసిన ప్రయత్నాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రేమ పుడుతుంది. కానీ పుట్టేలా చెయ్యకూడదు అనే లాజిక్ ని మర్చిపోయారు. ప్రస్తుత బయట ట్రెండ్ సినిమాలో చూపించినట్టుగా ఉండటం వల్ల పెద్ద లోపంగా అనిపించదు. గోపాల్ రావు, అఖిల్ మధ్య వచ్చిన సీన్స్ కూడా  రొటీన్ అయినా, డైలాగుల వాళ్ళ కొత్తగా అనిపించాయి. ఇంటర్ వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ ఎవరు ఊహించని విధంగా వేగంగా నడిచింది. ఒక పరిణితితో కూడిన ప్రేమని చూపించడంతో పాటు, ఆ ప్రేమని గెలిపించుకోవడానికి అఖిల్, కాత్యాయని కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేస్తారు. ఇది ఎంతో మందికి ప్రేమికులకి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. ముఖ్యంగా కాత్యాయని కోసం అఖిల్ చేసిన 'లవ్ వీడియో సాంగ్' ని కాత్యాయని తండ్రి చూసి షాక్ అయ్యే ఎపిసోడ్ అయితే బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ ఇంపాక్ట్ క్లైమాక్స్ దాకా పని చేసి థియేటర్స్ లో నవ్వుల జడివాన ని కురిపిస్తుందనే  చెప్పవచ్చు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మూవీకి పెద్ద ఎస్సెట్.

నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
అఖిల్ క్యారక్టర్ లో మౌళి తనూజ్ పెర్ ఫార్మెన్స్ నేటి యువతరంలో చాలా మందిని గుర్తు చేస్తుంది. తండ్రంటే భయం ఉన్న కొడుకుగా, ఇష్టం లేని చదువుని భారంగా చదువుతుండే స్టూడెంట్ గా, నచ్చిన అమ్మాయి కోసం పాజిటివ్ గా ఆలోచిస్తు, ఆమె కోసం వెయిట్ చేసే క్యారక్టర్ లో, ఇలా అన్ని వేరియేషన్స్ ని అద్భుతంగా ప్రదర్శించాడు. కాత్యాయని గా శివాని నాగరం తన క్యారక్టర్ పరిధి మేరకు పరిణితి చెందిన నటనని ప్రదర్శించింది. అఖిల్ ఫ్రెండ్ మధు క్యారక్టర్ లో జయకృష్ణ బాగా చేసాడు. తెలుగు సినిమాకి ఇంకో యువ కామెడీ నటుడు దొరికినట్లే అంతలా తనదైన మేనరిజం తో నవ్వించాడు. రాజీవ్ కనకాల, కంచి, అనితా చౌదరి, సత్యకృష్ణ ల నటనా  అనుభవం కూడా  కలిసి వచ్చింది. మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కథకి తగ్గట్టుగా ఉండటమే కాకుండా కొత్త రకం ట్యూన్స్ ని పరిచయం చేసినట్లయింది.  దర్శకత్వం, డైలాగ్స్ మెస్మరైజ్ చేసాయి. ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు పర్లేదు. 

ఫైనల్ గా చెప్పాలంటే యూత్ ని  టార్గెట్ గా చేసుకొని 'లిటిల్ హార్ట్స్' తెరకెక్కింది. ఆ విషయంలో మేకర్స్  బాగానే సక్సెస్ అయ్యారు. కానీ ఎలాంటి అసభ్యతకి తావు లేకపోవడంతో  ఫ్యామిలీ ప్రేక్షకులకి కూడా నచ్చే అవకాశాలు ఎక్కువ.  

 

రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                                                              అరుణాచలం 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.