పెద్ద సినిమాలకు షాకిచ్చిన లిటిల్ హార్ట్స్..!
on Sep 5, 2025

ఈ వారం మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఘాటి, మదరాసి, లిటిల్ హార్ట్స్ సినిమాలు నేడు(సెప్టెంబర్ 5) థియేటర్లలో అడుగుపెట్టాయి. అయితే వీటిలో పెద్ద సినిమాలు రెండూ నిరాశపరచగా.. చిన్న సినిమా 'లిటిల్ హార్ట్స్' మాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం విశేషం. (Little Hearts)
అనుష్క శెట్టి, క్రిష్ కాంబినేషన్ లో ఘాటి రూపొందగా.. శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో మదరాసి తెరకెక్కించి. దీంతో ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, మొదటి షో నుంచే ఈ రెండూ డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.
మరోవైపు, చిన్న సినిమాగా విడుదలైన 'లిటిల్ హార్ట్స్' మాత్రం పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా రోజుల తర్వాత థియేటర్లో మనస్ఫూర్తిగా నవ్వుకున్నామని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
టాక్ కి తగ్గట్టుగానే బుకింగ్స్ లోనూ 'లిటిల్ హార్ట్స్' డామినేషన్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఘాటి, మదరాసి సినిమాల కంటే.. లిటిల్ హార్ట్స్ బుకింగ్స్ బెటర్ గా ఉన్నాయి. చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించేలా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



