అప్పుడే ఓటీటీలోకి 'లైగర్'!
on Sep 20, 2022

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన 'లైగర్' సినిమా భారీ అంచనాలతో ఆగస్టు 25న విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన ఈ చిత్రం నాలుగు వారాలకే ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్ స్టార్ లో ఈ గురువారం(సెప్టెంబర్ 22) నుంచి 'లైగర్' మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుందట. హిందీ వెర్షన్ మాత్రం కాస్త ఆలస్యంగా విడుదల కానుందని సమాచారం. మరి థియేటర్స్ లో దారుణంగా నిరాశపరిచిన ఈ మూవీ.. ఓటీటీలోనైనా ఆదరణకు నోచుకుంటుందేమో చూడాలి.
ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించిన 'లైగర్'లో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



