'NC 22' కీలక అప్డేట్ వచ్చేసింది
on Sep 20, 2022

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని హీరో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా రానున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
నేడు(సెప్టెంబర్ 20) లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి సందర్భంగా 'NC 22' గురించి కీలక అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఈ సినిమా షూటింగ్ రేపటి(సెప్టెంబర్ 21) నుంచి ప్రారంభమవుతుందని తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. యూనిఫామ్ ధరించి ఉన్న చైతన్యకు గన్స్ గురి పెట్టినట్టుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. గతేడాది 'మానాడు'తో కోలీవుడ్ స్టార్ శింబుకి బ్లాక్ బస్టర్ అందించిన వెంకట్ ప్రభు ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ యాక్షన్ ఫిల్మ్ తో చైతన్యకు విజయాన్ని అందిస్తాడేమో చూడాలి.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



