విజయ్ బర్త్ డే స్పెషల్: `లైగర్` ఫస్ట్ గ్లిమ్స్ రానుందా?
on May 6, 2021
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ లో నటిస్తున్న సినిమా `లైగర్`. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తుండగా.. వెటరన్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం.. ఇలా పలు భారతీయ భాషల్లో పాన్ - ఇండియా మూవీగా రాబోతోంది.
ఇదిలా ఉంటే.. మే 9 విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని `లైగర్` యూనిట్ ఓ స్పెషల్ వీడియో ప్లాన్ చేసిందట. `లైగర్` ఫస్ట్ గ్లిమ్స్ పేరుతో ఈ వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. శుక్రవారం లేదా శనివారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ బజ్.
రోనిత్ రాయ్, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న `లైగర్`ని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.