`ఆదిపురుష్`లో సుదీప్?
on May 6, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ - ఇండియా మూవీస్ లో `ఆదిపురుష్` ఒకటి. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్ ని టి-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీతగా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణగా సన్నీ సింగ్
దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మరో సౌత్ స్టార్ కూడా కనిపించబోతున్నారట. ఆ స్టార్ మరెవరో కాదు.. కన్నడ నటుడు కిచ్చా సుదీప్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రావణుడి తమ్ముడు విభీషణుడు
పాత్రలో సుదీప్ నటించబోతున్నారట. అదే గనుక నిజమైతే.. `బాహుబలి` తరువాత ప్రభాస్ తో సుదీప్ నటించే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే `ఆదిపురుష్`లో సుదీప్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న `ఆదిపురుష్`.. ప్రస్తుతం ముంబైలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. 2022 ఆగస్టు 11న `ఆదిపురుష్`ని రిలీజ్ చేయడానికి
ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read