వృద్ధాశ్రమంలో కన్ను మూసిన లెజండరీ డైరెక్టర్!!
on Sep 24, 2023
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ లెజండరీ డైరెక్టర్ వృద్ధాశ్రమంలో కన్ను మూసారు. మలయాళ భాషలో ఎన్నో గొప్ప చిత్రాలను రూపొందించిన కె.జి. జార్జ్ సెప్టెంబర్ 24న కేరళ రాష్ట్రంలోని కక్కనాడుకు చెందిన ఓ వృద్ధాశ్రమంలో తుది శ్వాస విడిచారు.
1972లో ‘మాయ’ చిత్రంతో అసోసియేట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కె.జి.జార్జ్ 1975లో ‘స్వప్నదానం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమాకే జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించింది. దర్శకుడిగా ఈ సినిమా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ఆయన 30 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1998లో వచ్చిన ‘ఎలవమ్‌కోడు దేశం’ ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా. గత కొంతకాలంగా హృద్రోగానికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు జార్జ్. సెప్టెంబర్ 24న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కె.జి.జార్జ్ మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన భార్యతో పాటు కొందరు బంధువులు కూడా చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్నవారే. కానీ, ఆయన చివరి దశలో వృద్ధాశ్రమంలో ఉండడానికి గల కారణాలు తెలియరాలేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
