విరాట్ కోహ్లి బయోపిక్ చేయడం కంటే హ్యాపీ ఇంకేముంటుంది?
on Sep 24, 2023
రామ్, శ్రీలీల కాంబినేషన్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘స్కంద’. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న మరో భారీ యాక్షన్ మూవీ ఇది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 28కి వాయిదా పడిరది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరో రామ్ కొన్ని ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు. విరాట్ కోహ్లికి, మీకు పోలికలు ఉన్నాయంటున్నారు. దీనిపై మీరేమంటారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ... ‘నాకు, విరాట్ కోహ్లికి దగ్గరి పోలికలు ఉన్నాయని చాలా మంది అన్నారు. ఇస్మార్ శంకర్ కోసం ఒక కొత్త లుక్‌ను ట్రై చేశాం. అది పూర్తయిన తర్వాత సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాం. ఆప్పటి నుంచి విరాట్ కోహ్లితో నా లుక్ బాగా మ్యాచ్ అయింది’ అని తెలిపారు. విరాట్ కోహ్లి బయోపిక్ చేసే అవకాశం మీకు వస్తే ఆ సినిమాలో మీరు నటిస్తారా? అని అడిగితే ‘ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీ. అతని బయోపిక్ చేయడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంటుంది’ అన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
