ఓటీటీలో కొత్త సీన్స్‌తో ‘ఖుషి’.. పెరగనున్న సినిమా నిడివి?
on Sep 24, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయినప్పటికీ లాంగ్ రన్‌లో కలెక్షన్లు తగ్గి ఏవరేజ్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ఎన్నో సంస్థలు పోటీపడగా, నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ఆఫర్‌తో రైట్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్లలో రిలీజ్ అయిన వెర్షన్‌కు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించకపోవడంతో ఓటీటీ రైట్స్ తీసుకున్న నెట్‌ఫ్లిక్స్‌కి ఎంతో కొంత ఫేవర్ చెయ్యాల్సిన అవసరం ఉంది కాబట్టి విజయ్ దేవరకొండ, సమంతల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను జతచేయనున్నారని సమాచారం. సెన్సార్‌లో కట్ అయిన ఈ సీన్స్‌తో ‘ఖుషి’ సినిమాను కొత్తగా ముస్తాబు చేస్తున్నారని తెలుస్తోంది. ఓటీటీలో ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి మరి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
