కృతిశెట్టి బర్త్ డే : స్పెషల్ వీడియోతో సెలబ్రేట్ చేసిన యూనిట్
on Sep 21, 2023
‘ఉప్పెన’ చిత్రంతో ఓ ఉప్పెనలా దూసుకొచ్చి కుర్రకారుకి గిలిగింతలు పెట్టిన క్యూట్ హీరోయిన్ కృతిశెట్టి. ‘ఉప్పెన’ చిత్రం ఘన విజయంతో కృతికి వచ్చిన అప్లాజ్ మామూలుగా లేదు. ఈ సినిమా తర్వాత ఓ అరడజను సినిమాలకుపైగా చేసిన కృతి. ఇప్పుడు శర్వానంద్‌తో జతకడుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా35గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కృతిశెట్టి బర్త్‌డే వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఆమె బర్త్‌డేను ఒక సినిమా అప్‌డేట్‌తో సెలబ్రేట్ చేశారు.
శర్వానంద్ నటించే ఈ 35వ సినిమాలో కృతి ఎంతో క్యూట్‌గా కనిపిస్తూ మరోసారి తన అందంతో, అభినయంతో అందర్నీ అలరించేందుకు రెడీ అయింది. ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతిశెట్టికి చెందిన సీన్స్‌ను షూట్ చేస్తున్నప్పు మూమెంట్స్‌ను చూపించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
