'త్రీ ఇడియట్స్' ఫేమ్ అఖిల్ మృతి.. అసలు కారణమిదే..!
on Sep 21, 2023
.webp)
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. 'త్రీ ఇడియట్స్' చిత్రంలో లైబ్రేరియన్ దూబే గా అలరించిన నటుడు అఖిల్ మిశ్రా (58) కన్నుమూశారు. తాజాగా అఖిల్ మరణాన్ని ఆయన రెండో భార్య సుజానే బెర్నర్డ్ కన్ఫామ్ చేశారు. బాల్కనీలో ఏదో పని చేసుకుంటున్న తరుణంలో అఖిల్.. ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి కిందపడడంతో అక్కడికక్కడే మరణించారు.
1965 జూలై 22న జన్మించిన అఖిల్.. టీవీ సీరియల్స్ తో కెరీర్ ని ప్రారంభించారు. అటుపై 'హమారీ షాదీ' (1990)తో సినీ పరిశ్రమలో తొలి అడుగేశారు. 'కలకత్తా మెయిల్' ('చూడాలని వుంది' రీమేక్), 'గాంధీ మై ఫాదర్', 'వెల్ డన్ అబ్బా', 'డాన్', 'హజారన్ ఖ్వైషేన్ ఐసీ', 'త్రీ ఇడియట్స్' వంటి చిత్రాల్లో నటించారు. దాదాపు నాలుగేళ్ళ క్రితం 'మజ్ను కీ జూలియట్' పేరుతో యూట్యూబ్ కోసం ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. దీంట్లో తను నటించడమే కాకుండా రచన, దర్శకత్వం కూడా చేశారు.
ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1983లో మంజు మిశ్రాని పెళ్ళాడిన అఖిల్.. ఆమె మరణానంతరం (1997) సుజానే బెర్నర్డ్ ని వివాహమాడారు. 2009లో సుజానేని పెళ్ళాడిన అఖిల్.. ఆమెతో కలిసి 'మజ్ను కీ జూలియట్'తో పాటు ఓ సినిమాలోనూ, సీరియల్ లోనూ నటించారు. కాగా, అఖిల్ అకాల మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



