'కృష్ణ వ్రింద విహారి'.. థియేటర్స్ లో ఫట్, ఓటీటీలో హిట్!
on Nov 2, 2022

నాగశౌర్య, షెర్లీ జంటగా అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
ఈ ఏడాది జూన్ లో విడుదలైన 'అంటే సుందరానికీ' సినిమా మాదిరిగానే 'కృష్ణ వ్రింద విహారి' ఉండటం పెద్ద మైనస్ గా మారింది. అందుకే ఈ సినిమా థియేటర్స్ లో అంతగా ఆదరణ పొందలేకపోయింది. అయితే అక్టోబర్ 23 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఈ వారం ఇండియా వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న టాప్-10 లిస్టులో 'కృష్ణ వ్రింద విహారి' మొదటి స్థానంలో నిలిచింది.
ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ, అన్నపూర్ణ తదితరులు నటించారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



