'సర్దార్' డైరెక్టర్‌కు జాక్‌పాట్ గిఫ్ట్!
on Nov 2, 2022

తమిళ చిత్రసీమలో అగ్రనటుల్లో ఒకడు కార్తీ. ఆయన నటించిన చిత్రాలు వరుసగా అభిమానుల ఆదరణ పొందుతున్నాయి. కొన్ని నెలల క్రితం కార్తీ కథానాయకుడిగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన 'విరుమాన్' చిత్రం విడుదలైంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత గత సెప్టెంబర్‌లో మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వన్' వచ్చింది. ఈ సినిమాలో వల్లవరాయునిగా నటించి అందరి మన్ననలు పొందాడు కార్తీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది.
ఇదిలా ఉంటే, మిత్రన్ దర్శకత్వంలో 'సర్దార్' చిత్రంలో నటించాడు కార్తీ. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో రాజీషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. స్పై థ్రిల్లర్ తరహాలో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు రాబడుతోంది.
ఈ సినిమా మంచి విజయం సాధించడంతో 'సర్దార్' దర్శకుడు పి.ఎస్. మిత్రన్‌కి ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణ్‌కుమార్ సుమారు రూ. 78 లక్షల విలువైన టొయోటా ఫార్చ్యూనర్ కారును బహుమతిగా ఇచ్చి ఆయనను ఆశ్చర్యపరిచారు. దర్శకుడికి కార్తీ చేతుల మీదుగా ఈ కానుకను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 'విరుమాన్', 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాల తర్వాత 'సర్దార్' వరుసగా మూడో హిట్ కావడంతో కార్తీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ‘సర్దార్’ రెండో భాగం కూడా రూపొందనుందని చిత్రబృందం తెలియజేయడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



