ఈఫిల్ టవర్ ముందు సినిమా స్టైల్‌లో హన్సికకు ప్రపోజ్ చేసిన లవర్!
on Nov 2, 2022
.webp)
అందాల తార హన్సికా మొత్వాని ఇటీవల తన ప్రియుడు సొహేల్ ఖతూరియాతో నిశ్చితార్థం చేసుకుంది. అతడు తనకు ప్రపోజ్ చేసిన పిక్చర్స్‌ను లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. వీరిద్దరి పెళ్లికి నెల రోజుల సమయం ఉండడంతో వీరి పెళ్లి, హల్దీ, సంగీత్ వేడుకలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హన్సిక అభిమానులు సొహేల్ ఖతూరియా ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
హన్సిక కాబోయే భర్త సొహేల్, పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు మోకాలిపై కూర్చొని ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిపోర్టుల ప్రకారం, హన్సిక, సొహేల్ కొంతకాలంగా మంచి స్నేహితులు. ఆ ఇద్దరూ వ్యాపార భాగస్వాములు కూడా. గతంలో అనేక ఈవెంట్స్‌ను కలిసి ప్లాన్ చేసారు. సొహేల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త. కలిసి పనిచేసిన తరువాత, చివరికి వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు.
నవంబర్ 2న, హన్సిక తన బాయ్‌ఫ్రెండ్ సొహేల్ ఖతూరియాను ప్రపంచానికి పరిచయం చేయడానికి Instagram సాయం తీసుకుంది. ఆమె పారిస్‌లో జరిగిన పెళ్లి ప్రపోజల్ నుండి కొన్ని ఫొటోలను కూడా పంచుకుంది. పోస్ట్‌ను షేర్ చేస్తూ, హన్సిక హార్ట్ ఎమోజితో "నౌ & ఫరెవర్ (sic)," అని రాసింది. ఆ పోస్ట్‌కి ప్రత్యుత్తరం ఇస్తూ, "ఐ లవ్ యు మై లైఫ్ #NowAndForever (sic)" అని రాశాడు సొహేల్.
హన్సిక, సొహేల్ తమ వివాహ ప్రకటనను త్వరలో అధికారికంగా చేయనున్నారు. అయితే వీరి వివాహం డిసెంబర్ 2, డిసెంబర్ 4 మధ్య జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో జరగనుందని వార్తలు వస్తున్నాయి.
.webp)

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



