తెలుగు తెరకు కొత్తదనాన్ని పరిచయం చేసిన జేమ్స్‌బాండ్
on Nov 15, 2022

సూపర్ స్టార్ కృష్ణ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి సాహాసం, కొత్తదనం. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చేసినన్ని సాహసాలు ఎవరూ చేయలేదు. ఓ వైపు విభిన్న జోనర్ చిత్రాలతో సాహాసం చేస్తూ మరోవైపు తెలుగు తెరకు కొత్త కొత్త సాంకేతికతలను పరిచయం చేశారు.
కృష్ణ హీరోగా నటించిన మొదటి సినిమా 'తేనె మనసులు' పూర్తిగా కలర్ లో చిత్రీకరించిన తొలి తెలుగు సోషల్ ఫిల్మ్ కావడం విశేషం. ఇక ఆయన హీరోగా నటించిన మూడో సినిమా 'గూఢచారి 116' తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా. ఇలా కెరీర్ ప్రారంభం నుంచే ఆయన కొత్త పంథాలో పయనించారు. కృష్ణ స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా మూవీస్ నిర్మించిన 'మోసగాళ్ళకు మోసగాడు' తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం. ఇంగ్లీష్ లో డబ్ అయిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే. 'కొల్లేటి కాపురం'తో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికత పరిచయం చేశారు. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా 'గూడుపుఠాణి'. తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా 'ఈనాడు'. మొదటి డీటీఎస్ మూవీ 'తెలుగు వీర లేవరా'. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం 'భలే దొంగలు'. తెలుగులో 70 ఎంఎం సాంకేతికత ఉపయోగించిన తొలి సినిమా 'సింహాసనం'. స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా కూడా సింహాసనమే. ఇక 'అల్లూరి సీతారామరాజు' తెలుగులో ఫుల్ స్కోప్ సినిమాల్లో మొదటిది.
జేమ్స్‌బాండ్, కౌబాయ్ హాలీవుడ్ తరహా జానర్ చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేయడమే కాకుండా.. తెలుగు సినీ రంగాన్ని సాంకేతికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారు కృష్ణ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



