కొత్త లోక చాప్టర్ 1 ఓటిటి డేట్ ఇదేనా!
on Oct 9, 2025

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'యక్షలోకాన్ని' సృష్టించిన చిత్రం 'కొత్తలోక చాప్టర్ 1'(Kotha Lokah chapter 1) .మలయాళంలో తెరకెక్కినా అన్ని భాషలకి చెందిన ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకొని కంటెంట్ ఉన్న సినిమాకి కట్ అవుట్ అక్కర్లేదని నిరూపించింది. మౌత్ పబ్లిసిటీ తోనే ఏ రోజు కా రోజు సక్సెస్ రేంజ్ ని పెంచుకొని పాన్ ఇండియా మేకర్స్ కి సబ్జెక్ట్ , మేకింగ్, టెక్నికల్ పరంగా సరికొత్త సవాలు కూడా విసిరింది.
ఇక ఈ చిత్రం ఓటిటిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఓటిటి మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మేకర్స్ అధికారకంగా ప్రకటించకపోయినా అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓటిటి డేట్ కోసం సెర్చ్ చేస్తున్నారు. సౌత్ సినీ సర్కిల్స్ లో రీసెంట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం దీపావళి కానుకగా అక్టోబర్ 20 న స్ట్రీమింగ్ సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారప్రకటన రానుందని కూడా తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఓటిటి ప్రేమికులకి ఈ దీపావళి మరిన్ని వెలుగుల్ని పంచనుందని చెప్పవచ్చు.
ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(kalyani Priyadarshan)టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం ఆగష్టు 28 న మలయాళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే మూడువందల కోట్ల రూపాయిలకి పైగా గ్రాస్ ని రాబట్టి, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా నిలిచింది. అగ్ర హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)నిర్మించగా డొమినిక్ అరుణ్(Dominic Arun)దర్శకత్వం వహించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



