గోన గన్నారెడ్డి క్యారక్టర్ లో ఎన్టీఆర్, మహేష్ లో ఎవరు బెస్ట్
on Oct 9, 2025

సినిమా ఇండస్ట్రీలో ఒకరి అవకాశాల్ని ఇంకొకరు దక్కించుకోవడం అనేది సర్వసాధారణం. ఇందుకు అగ్ర హీరోలు సైతం అతీతులేం కాదు. మూవీలోని క్యారక్టర్ పై సదరు అగ్ర హీరోలు సైతం మనసుపడి నటించాలని అనుకున్నా కూడా, కొన్ని కారణాల వల్ల చెయ్యడం కుదరదు. మరో అగ్ర హీరో ఆ అవకాశాన్ని దక్కించుకుని మాస్ కి మరింతగా దగ్గరవుతాడు. ఇప్పుడు చెప్పుకోబోయే న్యూస్ పాతదే అయినా రీసెంట్ గా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది.
దర్శకుడు గుణశేఖర్(Gunasekhar)కి ఉన్న ప్రొటాన్షియల్ గురించి అందరకి తెలిసిందే. సెల్యులాయిడ్ పై అన్ని రకాల జోనర్స్ ని తెరకెక్కించడంలో స్పెషాలిటీ. అలాంటి ఒక జోనర్ కి చెందిన చిత్రమే 'రుద్రమదేవి'. టైటిల్ రోల్ ని అనుష్క(Anushka)పోషించగా,కథకి కీలకమైన మరో క్యారక్టర్ గోన గన్నారెడ్డి గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కనిపించాడు. కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పిన ఈ చిత్రం 2015 అక్టోబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే నేటికి పది సంవత్సరాలని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గతంలో గోన గన్నారెడ్డికి సంబంధించి గుణశేఖర్ చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.
ఆయన గతంలో మాట్లాడుతు గోన గన్నారెడ్డి క్యారక్టర్ గురించి మహేష్ బాబు(Mahesh Babu),ఎన్టీఆర్(Ntr)కి తెలుసు. ఆ ఇద్దరు కూడా సదరు క్యారక్టర్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అల్లు అర్జున్(Allu Arjun)గోన గన్నారెడ్డి క్యారక్టర్ లోకి వచ్చాడని తెలిపాడు. ఇప్పుడు ఈ మాటలు మరో సారి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, ఒక వేళ గోనగన్నారెడ్డి క్యారక్టర్ ని ఎన్టీఆర్, మహేష్ చేసి ఉంటే ఎలా ఉండేదని ఇరువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఫుల్ మాస్ అంశాలతో తెరకెక్కిన గోన గన్నారెడ్డి క్యారక్టర్ మాత్రం అల్లు అర్జున్ ని మాస్ ప్రేక్షకులకి మరింత దగ్గర చేసిందని చెప్పవచ్చు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



