తమన్ పై పంచులు పడుతున్నాయి!
on Feb 10, 2023

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. ఆయన ఏ సినిమాకి పని చేస్తూ ఉంటే ఆ సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తూ ఉంటారు. ఆ హీరో తన అభిమాన హీరో అని ఆ దర్శకుడితో చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని ఇలా ప్రతి సినిమాకి భజన చేస్తూ ఉంటారు. వీరసింహారెడ్డి సమయంలో కూడా బాలయ్య సినిమా చేయడం తన అదృష్టం అంటూ నా డ్రీమ్ సక్సెస్ అయిందంటూ బాగా ఎక్సైట్ అయిపోయారు.
ఇక ఇటీవల మీరు ఆస్కార్ కు ఎంపిక అవుతారా అని ప్రశ్నిస్తే త్రివిక్రమ్- మహేష్ బాబుల చిత్రం ద్వారా తాను ఆస్కార్ లెవల్ కి వెళ్తానని ట్రోల్స్ కు గురయ్యారు. పాన్ ఇండియా చిత్రం కూడా తీయని త్రివిక్రమ్ సినిమా దర్శకత్వంలో ఆస్కార్ కు వెళ్లడం ఎలా సాధ్యమని పలువురు ఆయనపై సెటైర్లు వేశారు. ఇక తాజాగా ఆయన శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న ఆర్సీ15కి సంగీతమందిస్తున్నారు.
ఈ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్నానని నోరు జారారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి సంగీతాన్ని అందిస్తున్నానని చెప్పారు. ఇక మహేష్- త్రివిక్రములతో రూపొంది సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఏ సినిమా ప్రస్తావన వస్తే ఆ సినిమానే తనకు ఆకాశమే హద్దు అన్నట్టుగా అత్యుత్సాహం చూపిస్తుంటారు.
ఇలా ఒకేసారి రామ్ చరణ్- మహేష్ బాబుల సినిమాల ప్రస్తావన తెచ్చి ట్రోల్స్ కు కారణం అవుతున్నారు. ఇంతమందిని అభిమానించే వాడివి... ఇంత విశాల హృదయం కలిగిన వాడివి.... ఇన్ని డ్రీమ్ ప్రాజెక్టు కలిగిన వాడివి.... ఇలాంటి వారిని మేము ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నీకే సాధ్యం..... ఇంతమందిని అభిమానించే నీలాంటి గొప్ప అభిమానిని మేము ఎక్కడా చూడలేదు తమన్ భయ్యా.... అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇకనైనా తమన్ ఇలాంటి వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని మాటల్లో కాకుండా సినిమాలకు ఇచ్చే సంగీతంపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



